Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం | Air Canada plane diverted after 16-year-old attacks family member mid-flight | Sakshi
Sakshi News home page

Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం

Published Mon, Jan 8 2024 6:28 AM | Last Updated on Mon, Jan 8 2024 6:28 AM

Air Canada plane diverted after 16-year-old attacks family member mid-flight - Sakshi

విన్నీపెగ్‌: ఎయిర్‌ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్‌ ప్రయరీస్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు.

గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్‌కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్‌ కెనడా తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement