
అనంతపురం: పావురాల కోసం బుధవారం రాత్రి బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు...కొత్తూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ అదే గ్రామానికి చెందిన శివప్ప, హేమంత్, భూపతి బంధువులు. ఇరు కుటుంబాలలో పావురాలు పెంచుకుంటున్నారు.
ఇటీవల పావురాలు తారుమారు కావడంతో రోజూ అడ్డపేర్లు పెట్టుకుని తిట్టుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో ఓ వర్గంలోని బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ, మరో వర్గంలోని భూపతికి గాయాలయ్యాయి. ఇరువురూ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment