న్యూయార్క్: అల్లరి పనులు చేస్తే పిల్లలను ఓ దెబ్బ వేసి మందలిస్తాం. అయితే దెబ్బ తగలకూడదనే అభిప్రాయంతో చాలామంది పిల్లలకు పిరుదులపైన కొడుతుంటారు. చెంపపై కొడితే పొరపాటున కంటికి తగిలే అవకాశం ఉండడంతో స్కూల్లో మాస్టార్లు కూడా బెత్తంతో కొట్టేది అక్కడే. అయితే ఇది పిల్లల ప్రవర్తన చెడుగా మారడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుడు టీ జెర్షాఫ్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘పిరుదులపైన కొట్టడడం వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు రావడాన్ని చాలామందిలో పరిశీలించాం. అవమానకరంగా కొట్టడం పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి ఓ కారణమని తేలింద’న్నారు.
ప్రవర్తనామార్పుపై యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసిన వివరాలను సైకలాజికల్ జర్నల్‌లో ప్రచురించారు. అయితే పిల్లల్లో ప్రవర్తన మార్పునకు మాత్రం కొట్టడమేనని, అందులో అవమానకరంగా కొట్టడం వల్ల పిల్లల్లో ప్రవర్తన మరింత చెడుగా మారుతుందని గుర్తించారు. ‘పిల్లల్ని కొట్టడడమనే సంప్రదాయం పాఠశాల నుంచే వచ్చిందనే విషయం మా పరిశోధనలో తేలింది. మాస్టార్లు కొడతారనే భయంతో పిల్లలు అల్లరి చేయకుండా ఉండడాన్ని గమనించిన పేరెంట్స్.. తాము కూడా అలాగే కొడితే పిల్లలు అదుపాజ్ఞలలో ఉంటారని భావించారు. అందుకే మాస్టారు కొట్టిన చోటే తల్లిదండ్రులు కూడా కొట్టడం మొదలైంది. ఇది పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తోంద’ని పరిశోధకుల్లో ఒకరైన ఎలిజబెత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment