ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మతి | man dies of dear attacks | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మతి

Published Wed, Aug 31 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

man dies of dear attacks

చిలమత్తూరు : ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్‌ పురం గ్రామం సమీపంలోని కర్ణాటక బందర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యర్రకొండ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. కుందేళ్లు, జింకలు, అడవి పందులు తదితర జంతువుల వేట కోసం కర్ణాటకకు చెందిన కొందరు వేటగాళ్లు గత ఆదివారం అడవిలోకి వెళ్లారు.

వీరిలో బందర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంతప్ప, బాలమ్మ కుమారుడు బాలరాజు కూడా ఉన్నారు. వేట సమయంలో ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కాగా మంగళవారం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement