'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం' | Disputes of two MLAs totally personal, says Jupally krishna rao | Sakshi
Sakshi News home page

'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'

Published Sun, Sep 6 2015 12:59 PM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'

'ఆ ఇద్దరి ఎమ్మెల్యేల వివాదం వ్యక్తిగతం'

హైదరాబాద్: మహబూబ్నగర్లో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం వ్యక్తిగతమైందని పరిశ్రమలు, చక్కెర, చేనేత, జౌళి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డిని రక్షించుకునేందుకు యత్నిస్తోందని జూపల్లి విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టకుండా రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.

ఈ వివాదంలో ఇద్దరు నేతలదీ తప్పు ఉందని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు. కాగా, మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుల మధ్య వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement