అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి | DK Aruna plays dramas, says Jupally | Sakshi
Sakshi News home page

అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి

Published Sat, Oct 1 2016 7:59 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి

అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి

హైదరాబాద్: రాజీనామా పేరుతో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అరుణ తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తుల కోసం జిల్లాల విభజన జరగడం లేదన్న విషయాన్ని అరుణ గుర్తించాలని మంత్రి జూపల్లి అన్నారు.

ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల విభజన జరుగుతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి గద్వాలలో డీకే అరుణ ఫ్యామిలీ పెత్తనం చేసిందని ఈ సందర్భంగా జూపల్లి ఆరోపించారు. కాగా, గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement