gadwal mla
-
మళ్లీ కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
అసెంబ్లీకి డీకే అరుణ.. ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత డీకే అరుణ మంగళవారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అయ్యారు. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైకోర్టు తీర్పు కాపీ, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేగా డీకే అరుణను డిక్లేర్ చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, సీఎస్ అసెంబ్లీ కార్యదర్శలకు ఉత్తర్వులు పంపింది. ఇక 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే అరుణ, తెరాస నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ చేయగా.. కృష్ణమోహన్‌రెడ్డి గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు డీకే అరుణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే బీ కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీకే అరుణ ఎన్నికను ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దానికి హైకోర్టు తీర్పు కాపీని సైతం జత చేశారు. 2018 డిసెంబరు 12 నుంచి ఆమెను ఎమ్మెల్యేగా పరిగణించాలని న్యాయస్థానం ఆ తీర్పులో పేర్కొన్న అంశాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఉటంకించింది. చదవండి: విషాదం.. నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు మృతి -
మద్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? : ఎమ్మెల్యే
గద్వాల అర్బన్: నడిగడ్డలో మద్యం ఏరులై పారించిన డీకే అరుణ మహిళలకు క్షమాపణ చెప్పి మద్య నిషేధంపై ఉద్యమించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీకే బంగ్లా రాజకీయ పునాదులు మద్యం, లిక్కర్‌పైనే ప్రారంభమైందని ధ్వజమెత్తారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల చుట్టూ సుమారు 40 దాబాలు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండేవన్నారు. స్వయంగా తన చేతులమీదుగా దాబా లు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తి మద్యపాన నిషేధం అంటూ నాటకాలు ఆడితే ప్రజలు హర్షించర న్నారు. ప్రస్తుతం కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తం గా సుమారు 25 మద్యం షాపులు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి నడుపుతున్నారని, ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా మీడి యా ముందు వెల్లడించారని గుర్తుచేశారు. మ ద్యపాన నిషేధంపై ఉద్యమించడం తప్పు కాదని, అయితే మద్యం, లిక్కర్‌పై వారి రాజకీయ జీవితం ప్రారంభమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. నిజంగా మహిళలపై ప్రేమ, మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధి ఉంటే ముందు మీ భర్త నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దు చేసుకొని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నడిగడ్డను దోచుకున్నారు..
గద్వాల అర్బన్: గడిచిన 70 ఏళ్లలో నడిగడ్డ అన్నిరంగాల్లో దోపిడీకి గురైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇక్కడి పాలకులు ఏసీ కార్లలో తిరుగుతుండగా ప్రజలు వలస పోతున్నారన్నారు. ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. మా పూర్వీకులు అలంపూర్ వాసులని, నడిగడ్డతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయని వివరించారు. రెండు జీవ నదుల మధ్య ఉన్న ఇక్కడి ప్రజలు ఇంకా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి గత పాలకుల దోపిడీనే కారమణ్నారు. సీఎం కేసీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి చేసి అలంపూర్ ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేశామని, వచ్చే ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేసి కోనసీమను తలపించేలా ఈ ప్రాంతం పచ్చని పైర్లతో కళకళలాడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధులను ఆదరిస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, వితంతులకు రూ.2 వేలు, వికలాంగులకు రూ.3 వేల ఆసరా పింఛన్లు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇన్నాళ్లు నిరాధారణకు గురైన వృద్ధులను ఆసరా పింఛన్లతో ప్రతి ఇంట్లో కొడుకులు, మనువళ్లు ఆదరిస్తున్నారన్నారు. గతంలో బోర్లు ఉంటే కరెంట్ ఉండేది కాదని, కరెంట్ ఉంటే ఎరువులు, విత్తనాలు ఉండేవి కావన్నారు. వ్యవసాయం దండగ అని భావించి వ్యవసాయాన్ని వదిలేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ రైతు పెట్టుబడి సాయం పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతు సగర్వంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడని చెప్పారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలతో బీడు భూములకు నీళ్లు మళ్లించే ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో అడుగులు పడుతున్నాయన్నారు. నూతన మున్సిపల్ చట్టంతో సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. గద్వాలను పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌కు కృషి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శాయశక్తులా కృషిచేస్తానని ఎంపీ రాములు అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించానని గుర్తు చేశారు. ఏ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తు న్నారన్నారు. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో పనిచేస్తానన్నారు. ఓటు బ్యాంకుగానే చూశారు.. గత పాలకులు ఇక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి విమర్శించారు. 40 ఏళ్లు ఒకే కుటుంబం పాలించి వారి ఆస్తులు పెంచుకున్నారని, కానీ ప్రజల కష్టాలు తీర్చలేదన్నారు. సుమారు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో చిన్నతరహా, కుటీర పరిశ్రమలు స్థాపిస్తానని, అందుకు అడుగులు ప్రారంభమయ్యాయని చెప్పారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆశీర్వదించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు చేతుల మీదుగా అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పౌర సన్మానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, కలెక్టర్ శశాంక, ఆర్డీఓ రాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, జెడ్పీ మాజీ చైర్మన్ భాస్కర్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, ఎంపీపీలు నజీమా ఉన్నీసాబేగం, మనోహరమ్మ, తిరుమల్‌రెడ్డి, రాజారెడ్డి, విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యులు పద్మ, శ్యామల, రాజశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ జ్యోతి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అరుణ డ్రామాలు ఆడుతున్నారు: జూపల్లి
హైదరాబాద్: రాజీనామా పేరుతో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అరుణ తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తుల కోసం జిల్లాల విభజన జరగడం లేదన్న విషయాన్ని అరుణ గుర్తించాలని మంత్రి జూపల్లి అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల విభజన జరుగుతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి గద్వాలలో డీకే అరుణ ఫ్యామిలీ పెత్తనం చేసిందని ఈ సందర్భంగా జూపల్లి ఆరోపించారు. కాగా, గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
డీకే అరుణ రాజీనామా
-
డీకే అరుణ రాజీనామా
హైదరాబాద్: గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నందుకే జిల్లాగా ప్రకటించడంలేదని చెబుతున్నారని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు లేఖ రాశానని తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. గద్వాలను జిల్లా చేయాలని వేలాది మంది ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని, పాదయాత్రలు, దీక్షలు చేపట్టామని, అయినా కేసీఆర్ స్పందించలేదని చెప్పారు. గద్వాల జిల్లాను ప్రకటించి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతున్నట్టు డీకే అరుణ చెప్పారు. -
డీకే అరుణకు ఝలక్!
హైదరాబాద్: మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాలో అరుణ తనదిగా చెప్పుకుంటున్న రూ.40 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్‌ప్లానింగ్ అధికారులు పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని ఉన్న 400 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో కూల్చివేతలు సాగాయి. అరుణ సంబంధీకులు అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థలం సొసైటీ లే అవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించారు. సొసైటీకి గాని, భరత సింహారెడ్డికిగాని ఈ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. కమిషనర్ సోమేష్‌కుమార్ ఆదేశించడంతో అధికారులు మూడు గంటల్లోనే ఆక్రమణలను తొలగించారు. కొంత కాలంగా భరత సింహారెడ్డి ఈ స్థలాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. సొసైటీ కూడా ఈ స్థలం తమదేనంటూ పేర్కొంటుండడం గమనార్హం. -
'మహబూబ్‌నగర్ లో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదు'
హైదరాబాద్: మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాలో అసలు బతుకమ్మ సంప్రదాయమే లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. అలాంటి జిల్లాలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవితను పిలవడమేంటని అరుణ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాయలంలో అరుణ మాట్లాడుతూ... పండగ సెంటిమెంట్‌తో అధికార టీఆర్ఎస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. ఈ సాకుగా చూపి ప్రజలను విభజించాలనుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడామని డికే అరుణ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దసరా పండగకు సెలవులు పెంచి... సంక్రాంతికి తగ్గించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.