డీకే అరుణకు ఝలక్! | ghmc official take over dk aruna land at jubilee hills check post | Sakshi
Sakshi News home page

డీకే అరుణకు ఝలక్!

Published Sun, Oct 4 2015 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 AM

డీకే అరుణకు ఝలక్!

డీకే అరుణకు ఝలక్!

హైదరాబాద్: మాజీ మంత్రి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు చౌరస్తాలో అరుణ తనదిగా చెప్పుకుంటున్న రూ.40 కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్-10 టౌన్‌ప్లానింగ్ అధికారులు పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని ఉన్న 400 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి నేతృత్వంలో కూల్చివేతలు సాగాయి. అరుణ సంబంధీకులు అడ్డుపడడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థలం సొసైటీ లే అవుట్‌లో ఖాళీ స్థలంగా గుర్తించారు. సొసైటీకి గాని, భరత సింహారెడ్డికిగాని ఈ స్థలంతో ఎలాంటి సంబంధం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.

కమిషనర్ సోమేష్‌కుమార్ ఆదేశించడంతో అధికారులు మూడు గంటల్లోనే ఆక్రమణలను తొలగించారు. కొంత కాలంగా భరత సింహారెడ్డి ఈ స్థలాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. సొసైటీ కూడా ఈ స్థలం తమదేనంటూ పేర్కొంటుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement