సాక్షి, మహబూబ్ నగర్: తెలంగాణలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. పలువురు సీనియర్ నేతలు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావాడంతో వారు ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, డీకే అరుణ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అసంతృప్తులు మాతో టచ్‌లో ఉన్నారు. జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి ఆహ్వానించాను. ఈ క్రమంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా మధ్య వ్యక్తిగత వైరం లేదు.. పార్టీ పరంగా విభేదాలు మాత్రమే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు.
ఇదే సమయంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై కూడా డీకే అరుణ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగులను బీఆర్‌ఎస్ మోసం చేస్తోంది. పేపర్ లీకేజీతో 30 లక్షల మందికి నిరుత్సాహమే మిగిలింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో రూ.కోట్లు చేతులు మారాయి. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పాత్ర ఉందని అనుమానం. పరీక్ష రాసిన ప్రతీ అభ్యర్థికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలి. ఈ వ్యవహారంపై బాధ్యత తీసుకోవాల్సిన మంత్రులు ఇష్యూను డైవర్ట్ చేస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. అరెస్ట్‌లు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా డీకే అరుణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 15వ తేదీన వరంగల్‌లో మొదటి నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే, రెండో నిరుద్యోగ మార్చ్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాడి ముగ్గురు మృతిచెందడం బాధకరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment