
సాక్షి, హైదరాబాద్: అప్పు చేస్తే తప్పు కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఇక్కడ ఆయన ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అవినీతి, లంచాల రూపంలో సంపాదిస్తే తప్పని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వ్యాపారం చేస్తే తప్పు కాదని అన్నారు. తను స్వయంకృషితో క్లర్క్ స్థాయి నుంచి ఈస్థాయికి వచ్చానన్నారు. ‘డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే నేను. నేను అవినీతి పరుడినంటూ అరుణ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతోంది’అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
దొంగ తెలివి తేటలు అరుణ కుటుంబానికే ఉన్నాయని, తాను నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును కట్టేశానన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు 3 గంటల్లో రాజీనామా చేస్తే అరుణ లాంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మూడేళ్లయినా రాజీనామా చేయలేదని ఎద్దేవా చేశారు. గద్వాలలో ఏ చెట్టు, పుట్టనడిగినా అరుణ కుటుంబం అక్రమ దందాల గురించి చెబుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment