
‘బండారం బయటపడుతుందనే పారిపోయారు’
హైదరాబాద్: సభలో రైతు సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పారిపోయిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, బాలరాజు అన్నారు. తమ బండారం బయటపడుతుందనే కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరికైనా దమ్ముంటే ఒకరు రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. రైతులు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యల గురించి ఎక్కువగా తెలుసని చెప్పారు.