ఢిల్లీ:తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోదని మంత్రి బాలరాజు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యమ నేపధ్యంలో మరోమారు మీడియా ముందుకొచ్చిన బాలరాజు కాంగ్రెస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదన్నారు. ఓ వైపు సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నా..తెలంగాణ ఇచ్చిన సమయం మాత్రమే సరైంది కాదంటున్నారన్నారు. కాగా, చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయాన్నిబాలరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సీమాంధ్ర జిల్లాల్లో అవిశ్రాంతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం వరుసగా 55వరోజూ ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంత నేతలు ఆందోళనకు గురౌతున్నారు. ఆదివారం సీమాంధ్ర ఉద్యమకారులు ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న నిరసన ప్రదర్శనలతో సమైక్యవాదులు హోరెత్తించారు. విశాఖలో సిక్కులు ై మానవహారం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దేవాంగులు విజయనగరం-పాలకొండ రహదారిలో ర్యాలీ చేపట్టి నడిరోడ్డుపైనే వస్త్రాలు నేశారు. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరక బస్సుయాత్ర చేపట్టారు. నరసన్నపేటలో మెయిన్ రోడ్డును దిగ్బంధించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సుమారు రెండువేల మంది కొబ్బరి వర్తకులు, ఒలుపు, ఎగుమతి, దిగుమతి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరి వలందరరేవులో మహిళలు జలదీక్ష చేశారు.