
కాంగ్రెస్ నేతల ఇళ్లకు టిడిపి నేతలు
హైదరాబాద్: బీజేపీతో దోస్తీ కట్టేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరాటపడుతున్నారని మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు విమర్శించారు. బీజేపీ సహకరిండం వల్లే విభజన జరిగిందని వారన్నారు.
చంద్రబాబు సీట్ల అయోమయంలో ఉన్నారన్నారు. పదవులిస్తాం పార్టీలో చేరాలంటూ చంద్రబాబు తన పార్టీ నేతలను కాంగ్రెస్ నేతల ఇళ్లకు పంపుతున్నారని చెప్పారు. టిడిపిలో చేరాలంటూ చంద్రబాబు తన వద్దకు కూడా రాయబారం పంపారని రామచంద్రయ్య చెప్పారు.