పోలవరం: పోలవరం నిర్వాసితులకు బాసటగా నిలిచినందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అధికారుల నిర్వాకంతో జిల్లా వాసులు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే...
పోలవరం నిర్వాసిత గ్రామమైన చేగొండిపల్లి నుంచి గ్రామస్తులు వెళ్లిపోవాలని ఇది వరకే హెచ్చరించిన అధికారులు శనివారం రాత్రి నుంచి గ్రామానికి తాగునీరు, కరెంట్ సరఫరాలను నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు చేగొండిపల్లి గ్రామస్తులతో మాట్లాడి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాలరాజుపై పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమలో అధికారుల ఓవరాక్షన్
Published Sun, Feb 21 2016 12:19 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement