రణరంగంలా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం | High Tension At Polavaram Project Area | Sakshi
Sakshi News home page

రణరంగంలా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం

Published Mon, Apr 15 2019 6:35 PM | Last Updated on Mon, Apr 15 2019 7:44 PM

High Tension At Polavaram Project Area - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు ప్రాంతం రణరంగంగా మారింది. కార్మికుల భద్రత పట్ల కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం ప్రాజెక్టు స్పీల్వే ప్రాంతంలో పనిచేస్తూ కిందపడిపోయి ఓ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. కార్మికుల భద్రత పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. నవయుగ కంపెనీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన కార్మికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement