అంబర్‌పేట,న్యూస్‌లైన్: ‘సాక్షి’ నార్సింగి విలేకరి బాలరాజు మృతి పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందిన విషయం తెలిసి ‘సాక్షి’ సిటీబ్యూరో ఇంచార్జ్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఫొటోవిభాగం ఎడిటర్ ఇంచార్జ్ రవికాంత్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టు సంఘం అధృక్షుడు వెంకటేష్ తదితరులు బాలరాజు భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. వివిధ చానళ్లు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆస్పత్రికి తరలివచ్చారు.
ఏపీడబ్ల్యూజేఎఫ్ సంతాపం: రోడ్డు ప్రమాదంలో బాలరాజు మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధానకార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, నేషనల్ కోఆర్డినేటర్ అమరయ్యలు ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. అతిచిన్న వయస్సులోనే బాలరాజును మృత్యువు కంబళించడంపై తీవ్రదిగ్భ్రాంతికి లోనయ్యారు.
మాజీ హోంమంత్రి సంతాపం :రోడ్డు ప్రమాదంలో బాలరాజు దుర్మరణం పాలవడంపై మాజీ హోంమంత్రి సబితారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. వార్తల సేకరణలో బాలరాజు చురుకుగా ఉండేవారని గుర్తుచేశారు.
విలేకరి మృతికి సంతాపం
Published Mon, Oct 28 2013 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement
Advertisement