
సాక్షి, విశాఖపట్నం : ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పొత్తుల వ్యవహారంతో పెద్ద కష్టం వచ్చిపడింది. చిరకాల రాజకీయ ప్రత్యర్ధి తెలుగుదేశంతో పొత్తు అంశం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టి స్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును ఆంధ్రప్రదేశ్ సినీయర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడున్నర దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీమంత్రి బాలరాజు ఆపార్టీకి రాజీనామా చేశారు.
ప్రస్తుతం విశాఖజిల్లా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తును బాలరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో బాలరాజు గిరిజనశాఖ మంత్రిగా పని చేశారు. కాగా, బాలరాజు జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది.