ఇద్దరు మిత్రుల హత్య | The murder of two friends | Sakshi
Sakshi News home page

ఇద్దరు మిత్రుల హత్య

Published Mon, Jan 13 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

The murder of two friends

  •      కొట్టి చంపిన దుండగులు
  •      పాతకక్షలే కారణమా?
  •  
    అత్తాపూర్, న్యూస్‌లైన్: అనుమానాస్పదస్థితిలో ఇద్దరు యువకులు హత్యకు గురైన ఘటన రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం...రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన ఎల్. నర్సింహ్మ కుమారుడు నందు (28) ప్రైవేట్ పని చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ఎం.మల్లేష్‌యాదవ్(27) పాలవ్యాపారి. ఇద్దరూ మంచి స్నేహితులు.

    కాగా అదే ప్రాంతానికి చెందిన నందు బంధువు బాలరాజు శనివారం వీరిద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా నందు, మల్లేష్‌లు ఇంటికి రాకపోవడంతో కు టుంబసభ్యులు వారికి ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ఇద్దరి నుంచీ స్పంద న లేదు. బాలరాజుకు కాల్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఉదయానికి కూడా ఇద్దరూ ఇంటికి చేరుకోకపోవడంతో కు టుంబసభ్యులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నందు, మ ల్లేష్‌లు రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే రహదారి పక్కన ఉన్న మానసహిల్స్ ప్రాంతంలో విగతజీవులై కనిపించారు. మృతదేహాలను చూడగా కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు.

    వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ ధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపినట్టు గుర్తించారు. డాగ్‌స్క్వాడ్‌ను ర ప్పించి పరిశీలించగా.. జాగిలం సంఘటనా స్థలం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోని మాణిక్యమ్మ కాలనీకి వెళ్లి ఓ ఇంటిముందు ఆగిపోయింది. అ నంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

    కాగా, బంధువైన బాలరాజు కుటుంబ సభ్యులతో నందుకు గతంలో గొడవ లు జరిగాయని, ఆ నేపథ్యంలో వారు అతనిపై దాడి చేశారని పోలీసులు తె లిపారు. ఆ సమయంలో మల్లేష్ కూడా అక్కడే ఉన్నాడని, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని, ఈ క్రమంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పో లీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. బాలరాజుతో పాటు అతని కుటుం బసభ్యులు శ్రీహరి, హరికృష్ణలపై నందు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement