
'మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసానికి మారుపేరని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు.
ప.గో: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసానికి మారుపేరని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు. జిల్లాలోని జీలుగుమిల్లిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఈ సమావేశానికి బాలరాజుతో పాటు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ తోట చంద్రశేఖర్ హాజరైయ్యారు. విశ్వసనీయతకు మారుపేరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు అని బాలరాజు పేర్కొన్నారు..
రాష్ట్రానికి సమైక్యంగా ఉంచే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని బాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుక్కలు చించిన విస్తరిలాగా తయారైందన్నారు.