
మంత్రి బాలరాజుకు పరాభవం
విశాఖపట్నం: మంత్రి బాలరాజుకు తన సొంత జిల్లాలోనే పరాభవం జరిగింది. కొయ్యూరు మండలం రేవల్ల రచ్చబండకు మంత్రి బాలరాజు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులు పెద్దగా హాజరుకాలేదు. దాంతో మంత్రిగారికి కోపం వచ్చింది. తాను హజరైన కార్యక్రమానికి అధికారులు హాజరుకాకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు.
వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరించారు. రచ్చబండని అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపారు. మంత్రి బాలరాజే స్వయంగా ఫోన్ చేసి విషయం చెప్పడంతో విస్తుపోవడం కలెక్టర్ వంతైంది.