
చిల్పూరు: కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఓ వ్యక్తి ట్యాంక్‌పైకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో గురువారం చోటుచేసుకుంది. వెంకటాద్రిపేటకు చెందిన రాధమ్మ–రాజయ్య దంపతుల మూడో కుమారుడు బాలరాజు(37) పలు కేసుల్లో నిందితుడు. ఇద్దరు భార్యలు మృతి చెందగా జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఉదయం బాలరాజు ఐదు లీటర్ల పెట్రోలు క్యాన్, క్రిమిసంహారక మందు డబ్బా తీసు కుని గ్రామసమీపంలోని దేవాదుల రిజర్వాయర్‌లోకి వెళ్లి వాటర్ ట్యాంకు ఎక్కాడు. అక్కడి నుంచి 100 నంబర్‌కు డయల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.
వారు చిల్పూరు ఎస్సై శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని, విలేకరులు వస్తేనే దిగుతానని అనడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగిన బాలరాజు.. తాను చేసిన తప్పు కారణంగా నా తమ్ముడిపైన కేసు పెట్టారు.. కేసు లేకుండా చేయాలని కోరాడు. ఇందుకు పోలీసులు హామీనిచ్చారు. అయితే.. వెంట తెచ్చుకున్న సామగ్రి తెచ్చుకుంటానని ట్యాంక్‌పైకెళ్లి ముందుగా క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. ఎస్పై 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి ట్యాంకు పైకి వెళ్లి చూసేసరికే అప్పటికే సజీవదహనం అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment