
విశాఖ ఏజెన్సీలో కుండపోత వర్షం
పాడేరు: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పాడేరు, పెద్దబయలు సహా ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకు భారీ వర్షం మొదలు కాగా, 2.30 గంటల సమయంలోనూ కొనసాగుతోంది.
దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. పరదనిపొట్టు వద్ద, పాడేరు-రాయగడ మధ్య మత్స్యగడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.