విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.
ఏజెన్సీలోని అరకు, లంబసింగిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 13 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు
Published Thu, Jan 28 2016 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement