రవితేజ సినిమాలో చాన్స్‌.. రాత్రికి రాత్రే మార్చేశారు: హీరోయిన్‌ దివి | Divi Vadthya Emotional Words About Her Career Struggles | Sakshi
Sakshi News home page

Divi Vadthya: చాలా మంది రిజెక్ట్‌ చేశారు.. బాత్రూమ్‌లో షవర్‌ పెట్టుకొని ఏడ్చేదాన్ని

Published Thu, Mar 14 2024 2:09 PM | Last Updated on Thu, Mar 14 2024 2:53 PM

Divi Vadthya Emotional Words About Her Career Struggle - Sakshi

సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగంలో రాణించాలంటే చాలా కష్టపడాలి. మనలో ఉన్న టాలెంట్‌ని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. అందం, అభినయం అన్నీ ఉన్నా.. నటించే అవకాశం రాక వెనుదిరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒక సినిమాలో నటించే అవకాశం అంత ఈజీగా రాదు. వారసత్వాన్ని పక్కన పెడితే బయట నుంచి వచ్చే వాళ్లు తొలి సినిమా కోసం ఓ మినీ యుద్ధమే చేస్తారు. నటి దివి కూడా సినిమా చాన్స్‌ల కోసం పెద్ద యుద్దమే చేసిందట. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టు తిరిగి తిరిగి అలిసిపోయిన సందర్భాలు ఉన్నాయట. ఒకనొక సందర్భంలో రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందంట.

బిగ్‌బాస్‌ ద్వారా ఫేమస్‌ అయిన ఈ బ్యూటి..తాజాగా లంబసింగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 15న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన సినిమా కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. 

మోడలింగ్‌ నుంచి వచ్చిన నేను సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. చాలా ఆఫీసుల చుట్టు తిరిగాను. ఎన్నో ఆడిషన్స్‌ ఇచ్చాను. చాలా మంది రిజెక్ట్‌ చేశారు. కొంతమంది ఫోన్‌ చేస్తామని చెప్పి..మళ్లీ టచ్‌లోకి కూడా రాలేదు. మరికొంతమంది మొహం మీదే తిరస్కరించారు. సన్నగా ఉన్నానని ఒకరు .. లావుగా ఉన్నావంటూ మరొకరు రిజెక్ట్‌ చేసేవారు.

ఆ సమయంలో చాలా బాధపడేదాన్ని. బాత్రూమ్‌లో షవర్‌ పెట్టుకొని, నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. బెడ్‌పై దిండు కవర్‌ చేసుకొని వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాన్స్‌ల కోసం ఓ పాటలో నటిస్తే..డాన్స్‌ సరిగా చేయలేదని ట్రోల్‌ చేశారు. ఇంకా ఘోరం ఏంటంటే.. ఓ సినిమాలో సెలెక్ట్‌ చేసి.. రాత్రికి రాత్రే మార్చేశారు. అది రవితేజ గారి సినిమా. అందులో రవితేజ పక్కన లీడ్‌ రోల్‌. ఐదు రోజుల్లో షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుండగా రాత్రికి రాత్రే నన్ను మార్చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement