విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖపట్నం ఎజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగిలో 7 డిగ్రీలు... చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి.
జనవరి నెలాఖరు వరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయన్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే గానీ ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
వణుకుతున్న విశాఖ ఏజెన్సీ
Published Thu, Dec 10 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
Advertisement
Advertisement