భరత్ హీరోగా, బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం లంబసింగి. ఎ ప్యూర్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో జీకే మోహన్ నిర్మించారు. ఈ సినిమాలోని తొలి పాట 'నచ్చేసిందే నచ్చేసిందే..'ని అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన మూవీ లంబసింగి. ఈ చిత్రంలోని నచ్చేసిందే నచ్చేసిందే పాట బాగుంది. అందరూ వినండి అన్నారు.
నవీన్ గాంధీ మాట్లాడుతూ.. విశాఖ సమీపంలోని లంబసింగి నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. సినిమా అంతా లంబసింగిలోనే తీశాం. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను తెలిపే గీతమే నచ్చేసిందే నచ్చేసిందే. సిద్ శ్రీరామ్ గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, ఆర్‌ఆర్ ధృవన్ సంగీతానికి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్, నిర్మాణం: కాన్సెప్ట్ ఫిలింస్.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్, పెళ్లి ఫొటోలు చూసేయండి
Comments
Please login to add a commentAdd a comment