జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఈదురుగాలులు కలవరపెడుతున్నాయి. వాతావరణ మార్పులతో కురుస్తున్న వర్షాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. గరి ష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నా యి.
వేసవి ప్రారంభమైన ఈ తరుణంలో గరిష్ట ష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలకంటే తక్కువకు పడిపోవడం కలవరపెడుతోంది. గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతోపాటు ఈదరగాలులు వీస్తున్నాయి. విజృంభిస్తున్న చలి తీవ్రతతో ఇటు వృద్ధులు, అటు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరంతో చిన్నారులు అసుపత్రుల బారిన పడుతున్నారు.
ఆకాల వర్షాలు
అకాల వర్షాలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల్లో ఎప్పుడో ఓ సారి కురుస్తుంటాయి. గంటల్లోనే దీని ప్రభావం ముగుస్తుంది. అకాల వర్షాలకు అల్పపీడన ద్రోణి జతకావడంతో నాలుగైదు రోజులుగా జిల్లాలో వర్షాలు, వడగండ్ల వాన కురుస్తోంది. ఫలితంగా మొక్కజొన్న, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
చలితీవ్రత
సాధారణంగా చలి ప్రభావం ఫిబ్రవరి నెలాఖరు వరకే ఉంటుంది. శివరాత్రికి చలి శివశివా.. అంటూ వెళ్తుందని చెబుతుంటారు. కానీ, శివరాత్రి అయిపోయిన తర్వాత చలిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణ రోజుల్లో గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అల్పపీడన సమయంలో మాత్రం 12 నుంచి 20 కి.మీ. వేగంతో వీస్తుంటాయి.
ఈ గాలు లు భూభాగం పైకి వచ్చే సమయంలో, మార్గమధ్యలో ఏదైనా ఆటంకం ఎదురైతే గాలులు దిశను మార్చుతాయి. దీనివల్ల వర్షాలు, తేమ శాతం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా చలి ప్రభావం పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే ఈదరగాలుల ప్రభావం మరో రెండు రోజుల తప్పదన్నమాటే.
వామ్మో.. చలి
Published Fri, Mar 7 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement