JAGItyala town
-
జగిత్యాల : పెళ్లి చేయాలంటూ పోలీస్టేషన్ ముందు యువకుడు హల్ చల్
-
‘అందుకే తెలంగాణలో తక్కువ కరోనా కేసులు’
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో తక్కువ టెస్ట్‌లు చేస్తున్నందువల్లే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ... ‘పక్క రాష్ట్రాల్లో 2 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణ లో కేవలం 22 వేల టెస్టులు మాత్రమే చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదు. ఐ సీ ఎం ఆర్ ప్రైవేట్ ఆసుపత్రులలో టెస్టులు చేయాలని చెబితే హైకోర్టు చెప్పేవరకు రాష్ట్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తప్పుడు ధోరణి వల్లనే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 వేలు టెస్టులు చేయాల్సి ఉంటే కేవలం 200 మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇక మీరు వాళ్లకు ఎం తిండి పెడతారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వలస కులీలకు రవాణా ఖర్చులు చెల్లించినందుకు అభినందిస్తున్నాను. కేంద్రం నుండి వివిధ వర్గాల నుండి వచ్చిన విరాళాల వివరాలు చెప్పమంటే చెప్పట్లేదు. కరోనాకు ఎంత ఖర్చు చేశారో కూడా చెప్పట్లేదు. 6 ఏళ్లుగా అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. రాష్ట్రం కరోనా వల్ల అప్పులపాలు కాలేదు. రాష్ట్ర ప్రజలను, బండ్లను కుదువపెట్టి 4 వేల కోట్లు అప్పు తెచ్చారు. మహ్మద్ బిన్ తుగ్లక్ కంటే కేసీఆర్ ఎక్కవ చెబుతున్నారు’ అని ఉత్తమ్ కుమార్ ధ్వజమెత్తారు. (కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం) ఇంకా ఆయన మాట్లాడుతూ... కందులు కొని 3 నెలలు గడిచినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ మళ్ళీ కంది పంట వేయమంటరా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకంలో మోసం జరిగిందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో ఎన్నికలు వున్నాయని రైతుబందు ఇచ్చారన్నారు. మొట్టమొదటిసారి క్రాప్ ఇన్సూరెన్స్ లేదని, రాష్ట్రంలో రైతులను దేవుడికి వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏందాకైనా పోరాడుతుందని చెప్పారు. పత్తి విత్తనాల కంపెనీలతో ప్రభుత్వానికి లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. పత్తి 7 వేలకు కొంటేనే వేయమని చెప్పాలని, నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు తగిన ధర ఇచ్చినప్పుడే పంటలు వేయమని చెప్పాలి అని ఉత్తమ్‌కుమార్ అన్నారు. (కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారింది: వివేక్) -
వామ్మో.. చలి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ :అకాల వర్షాలు భయపెడుతున్నాయి. ఈదురుగాలులు కలవరపెడుతున్నాయి. వాతావరణ మార్పులతో కురుస్తున్న వర్షాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. గరి ష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నా యి. వేసవి ప్రారంభమైన ఈ తరుణంలో గరిష్ట ష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలకంటే తక్కువకు పడిపోవడం కలవరపెడుతోంది. గాలిలో తేమశాతం అధికంగా ఉండడం, ఆకాశం మేఘావృతమై ఉండడంతోపాటు ఈదరగాలులు వీస్తున్నాయి. విజృంభిస్తున్న చలి తీవ్రతతో ఇటు వృద్ధులు, అటు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, జ్వరంతో చిన్నారులు అసుపత్రుల బారిన పడుతున్నారు. ఆకాల వర్షాలు అకాల వర్షాలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల్లో ఎప్పుడో ఓ సారి కురుస్తుంటాయి. గంటల్లోనే దీని ప్రభావం ముగుస్తుంది. అకాల వర్షాలకు అల్పపీడన ద్రోణి జతకావడంతో నాలుగైదు రోజులుగా జిల్లాలో వర్షాలు, వడగండ్ల వాన కురుస్తోంది. ఫలితంగా మొక్కజొన్న, మామిడి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చలితీవ్రత సాధారణంగా చలి ప్రభావం ఫిబ్రవరి నెలాఖరు వరకే ఉంటుంది. శివరాత్రికి చలి శివశివా.. అంటూ వెళ్తుందని చెబుతుంటారు. కానీ, శివరాత్రి అయిపోయిన తర్వాత చలిగాలుల తీవ్రత పెరిగింది. సాధారణ రోజుల్లో గంటకు 3 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అల్పపీడన సమయంలో మాత్రం 12 నుంచి 20 కి.మీ. వేగంతో వీస్తుంటాయి. ఈ గాలు లు భూభాగం పైకి వచ్చే సమయంలో, మార్గమధ్యలో ఏదైనా ఆటంకం ఎదురైతే గాలులు దిశను మార్చుతాయి. దీనివల్ల వర్షాలు, తేమ శాతం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితంగా చలి ప్రభావం పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే ఈదరగాలుల ప్రభావం మరో రెండు రోజుల తప్పదన్నమాటే.