పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు | Increased night temperatures | Sakshi
Sakshi News home page

పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు

Published Sun, Dec 4 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

Increased night temperatures

- సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదు
- నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధా రణం కంటే కాస్తంత పెరిగాయి. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. గత 24 గంటల్లో  రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. భద్రాచలంలో సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 21 డిగ్రీలు నమోదైంది.

మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హకీంపేటల్లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యారుు. ఒక్క హన్మకొండలో మాత్రమే 2 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు నమోదైంది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అది ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement