
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి మొదలైంది. తెలంగాణలో అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చలి పెరిగింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రామగుండంలో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిం ది. ఫలితంగా గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.