సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాలో చలి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నా.. వేకువ ఝామున, రాత్రి సమయాల్లో లో టెంపరేచర్ల కారణంగా చలి ప్రభావం విపరీతంగా ఉంటోంది. మరో నాలుగైదు రోజుల పాటు ఈ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో.. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
తాజాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్‌లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యానిలో 8 డిగ్రీలు, కెరమెరిలో 6.8 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ బజారాత్నూర్ లో 7.4 డిగ్రీలు, బేల 7.6 డిగ్రీలు, పోచ్చేరలో 7.7 డిగ్రీలు, జైనథ్ 7.9 డిగ్రీలు, నేరడిగొండ 8.2 డిగ్రీలు, బోరజ్ 8.1డిగ్రీలు, తలమడుగులో 8.4 డిగ్రీలు చలికి వణుకుతున్నా ప్రజలు. నిర్మల్ కుంటాల 9.9 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల దండేపల్లి వెల్గనూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక సంగారెడ్డి నల్లవల్లీ.. సిద్ధిపేట నంగనూర్‌లో 10 డిగ్రీల సెల్సియస్, మెదక్ కౌడిపల్ల 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం విపరీతంగా కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో పరిస్థితి సాధారణానికి చేరుకున్నా.. ఆపై పదిరోజులకు మళ్లీ చలి గాలులు మొదలు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment