Winter waves
-
Telangana: గజ గజ.. ఇంకెన్ని రోజులంటే..!
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో పలు జిల్లాలో చలి పంజా విసురుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నా.. వేకువ ఝామున, రాత్రి సమయాల్లో లో టెంపరేచర్ల కారణంగా చలి ప్రభావం విపరీతంగా ఉంటోంది. మరో నాలుగైదు రోజుల పాటు ఈ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో.. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తాజాగా.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్లో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యానిలో 8 డిగ్రీలు, కెరమెరిలో 6.8 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ బజారాత్నూర్ లో 7.4 డిగ్రీలు, బేల 7.6 డిగ్రీలు, పోచ్చేరలో 7.7 డిగ్రీలు, జైనథ్ 7.9 డిగ్రీలు, నేరడిగొండ 8.2 డిగ్రీలు, బోరజ్ 8.1డిగ్రీలు, తలమడుగులో 8.4 డిగ్రీలు చలికి వణుకుతున్నా ప్రజలు. నిర్మల్ కుంటాల 9.9 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల దండేపల్లి వెల్గనూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సంగారెడ్డి నల్లవల్లీ.. సిద్ధిపేట నంగనూర్లో 10 డిగ్రీల సెల్సియస్, మెదక్ కౌడిపల్ల 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ చలి ప్రభావం విపరీతంగా కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో పరిస్థితి సాధారణానికి చేరుకున్నా.. ఆపై పదిరోజులకు మళ్లీ చలి గాలులు మొదలు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో చలి.. మరింత పెరిగే ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటి పూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. శనివారం(ఇవాళ), ఆదివారం చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో వికారాబాద్ పరిధిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంత్లానూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. పోను పోను మరింతగా చలి ప్రభావంగా మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల ప్రజలు గత వారంగా స్వెట్టర్లు, మంకీ క్యాప్స్‌పై ఆధారపడుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది చలి కాలంలో రికార్డు స్థాయిలో లో-టెంపరేచర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక గుండె జబ్బులు, అస్తమా, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు సాధ్యమైనంత వరకు మార్నింగ్ వాకింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని పేరెంట్స్‌కి సూచిస్తున్నారు. -
సంక్రాంతి వరకూ వణుకే..
* కోస్తాంధ్ర, తెలంగాణలో చలి తీవ్రం * ఉత్తరాది నుంచి శీతల గాలులు * పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొద్ది రోజుల విరామం తర్వాత చలి ఊపందుకుంటోంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఉత్తరాదిలో వాతావరణం కూడా ఇందుకు దోహదపడుతోంది. అక్కడ నుంచి వీస్తున్న శీతల పవనాలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాది వాతావరణ ప్రభావం వలన తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలి పారు. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమల్లోను, తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 4, తెలంగాణలో 3 నుంచి 6 డిగ్రీల చొప్పున సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లలో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.