మూడు కోట్ల వజ్రాల హారం ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దాదాపు రూ.మూడు కోట్లు విలువ చేసే వజ్రాల ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. బాధితురాలు ఎయిర్ లైన్ కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కూతురు. పోలీసుల వివరాల ప్రకారం ఆనంద్ లోక్ ప్రాంతంలో ఉంటున్న ఎయిర్ లైన్ కు చెందిన ఓ అధికారి కూతురు తన కుటుంబంతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెళ్లిన వారు తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తిరిగొచ్చారు.
ఆ సమయంలో ఇంట్లో పనిచేసే వాళ్లు ఇంటి వెనుక భాగంలో నిద్రపోయారు. అయితే, పెళ్లికి వచ్చేవారు తిరిగొస్తారు కదా అనే గేట్ కు తాళం వేయలేదు. అలాగే కిటికీలు కూడా సరిగా మూయలేదు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు కిటికీల ద్వారా ఇంట్లో దూరి ఓ గదిలోకి వెళ్లి అల్మారా పగులగొట్టి మూడు కోట్లు విలువైన వజ్రాల హారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతోపాటు రూ.60 వేలు కూడా దోచుకెళ్లారు. పెళ్లికి వెళ్లొచ్చిన వారు ఇది చూసి అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.