Rs 3 crore
-
సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..
ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు. నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? 2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. -
మూడు కోట్ల వజ్రాల హారం ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దాదాపు రూ.మూడు కోట్లు విలువ చేసే వజ్రాల ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. బాధితురాలు ఎయిర్ లైన్ కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కూతురు. పోలీసుల వివరాల ప్రకారం ఆనంద్ లోక్ ప్రాంతంలో ఉంటున్న ఎయిర్ లైన్ కు చెందిన ఓ అధికారి కూతురు తన కుటుంబంతో కలిసి ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెళ్లిన వారు తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తిరిగొచ్చారు. ఆ సమయంలో ఇంట్లో పనిచేసే వాళ్లు ఇంటి వెనుక భాగంలో నిద్రపోయారు. అయితే, పెళ్లికి వచ్చేవారు తిరిగొస్తారు కదా అనే గేట్ కు తాళం వేయలేదు. అలాగే కిటికీలు కూడా సరిగా మూయలేదు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు కిటికీల ద్వారా ఇంట్లో దూరి ఓ గదిలోకి వెళ్లి అల్మారా పగులగొట్టి మూడు కోట్లు విలువైన వజ్రాల హారాన్ని ఎత్తుకెళ్లారు. దాంతోపాటు రూ.60 వేలు కూడా దోచుకెళ్లారు. పెళ్లికి వెళ్లొచ్చిన వారు ఇది చూసి అవాక్కయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నవనిర్మాణ దీక్షకు రూ.3 కోట్ల ఖర్చా?
అంతా ప్రభుత్వాధికారుల జేబుల్లోదే.. రోజుకు 5వేల మంది తరలింపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బందీఖానా ‘ప్రపంచస్థాయి రాజధాని మనముందున్న లక్ష్యం. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోవాలి. కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా లేని పరిస్థితిలో పాలన ప్రారంభించాం. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.’ అని పదేపదే చెబుతున్న సీఎం చంద్ర బాబు ప్రచార ఆర్భాటాలకు మాత్రం వృథాగా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రజల్లో విమర్శలు వస్తున్నాయి. తాజాగా నవనిర్మాణ దీక్ష.. దుబారా దీక్షగా మారిందని, దీనికోసం దాదాపు రూ.3 కోట్లుఖర్చుచేయడంపై అధికార వర్గాలు, ప్రజలు విస్తుపోతున్నారు. విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షా వారోత్సవాలకు దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతోందని అంచనా. వారం రోజుల పాటు ఏడు మిషన్లుగా జరుపుతున్న ఈ కార్యక్రమాలకయ్యే ఖర్చు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి పెనుభారంగా మారింది. వారోత్సవాలకు అయ్యే ఖర్చును జిల్లా యంత్రాంగమే ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ కార్యక్రమాల ఏర్పాట్లు, జనసమీకరణ, భోజనాలు, ఫలహారాలు.. అమాం బాపతు ఖర్చులన్నీ వివిధ శాఖల అధికారులే చూసుకుంటున్నారు. మొదటి రోజు నవనిర్మాణ దీక్ష అంటూ బెంజిసర్కిల్ వద్ద భారీస్థాయిలో దీక్షాస్థలి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లాలోని అన్ని మండలాల నుంచి అన్నివర్గాల ప్రజలను తరలించారు. వీరికి స్నాక్స్, భోజన వసతికి అయిన ఖర్చు ఎంపీడీవోలు భరించారు. జనసమీకరణ కోసం పాఠశాలలు, కళాశాలల బస్సులను వినియోగించారు. రవాణా శాఖ కొన్ని బస్సులను ఏర్పాటుచేసింది. రెండవరోజు విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌కు ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలపై అవగాహన, ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రోజూ 5వేల మందిని జిల్లా నలుమూలల నుంచి తరలించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో తిరిగి జనాన్ని పోగు చేసుకుని 11 కల్లా విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌కు తీసుకురావడం వారి విధి. పోదామంటే పోనీయరు రోజూ ఉదయం వివిధ అంశాలపై చర్చాగోష్టి నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు పెట్టి సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సాయంత్రం వరకూ ఉంచుతున్నారు. సాయంత్రం 5 లేదా 6 గంటల సమయంలో సీఎం వచ్చి ప్రసంగించే వరకూ జనాన్ని బయటకు వదలట్లేదు. ఉదయం వచ్చిన జనం దాదాపు 7, 8 గంటలు మీటింగ్ హాల్లోనే ఉంటున్నారు. ఇందుకు ఇష్టపడని కొందరు బయటకు వెళ్లిపోతామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. తలుపులకు తాళాలు వేసేస్తున్నారు. రోజూ సీఎం ప్రసంగంలో విభజన కష్టాలు, రాజధాని నిర్మాణం, ప్రతపక్షంపై చేసే విమర్శలే ఉండటంతో ‘ఎందుకొచ్చాం రా.. దేవుడా..’ అంటూ ఆపసోపాలు పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో ఒకరోజు వచ్చినవారు మరుసటి రోజు రావడానికి సాహసించటం లేదు. 3వ తేదీన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో వచ్చిన పరిణామాలపై చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి రూలింగ్ ఇచ్చారు. ఉదయం వచ్చిన టీచర్లను హాలులో ఉంచి పోలీసులు తాళాలు వేసేస్తున్నారు. సాయంత్రం సీఎం వచ్చి వెళ్లే వరకూ ఇదే పరిస్థితి. కొందరు టీచర్లు బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తే వారి పేర్లు, ఫోన్ నంబర్లు రికార్డు చేసి బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నట్లు సమాచారం. నాల్గో తేదీన రెండేళ్లలో సాధించిన ప్రగతిపై డ్వాక్రా సంఘాలతో చర్చాగోష్టి నిర్వహించారు. ఉదయం వచ్చిన డ్వాక్రా మహిళలు రోజంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 5, 6 తేదీల్లో రైతులు ఎన్ఆర్ఈజీఎస్ కూలీలను తరలించారు. రూ.కోట్లలో ఖర్చు వారోత్సవాల్లో భాగంగా ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వరకూ చర్చాగోష్టి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 5వేల మందికి భోజనం, ఇతర తినుబండారాలకు కలిపి రోజుకు రూ.10 లక్షల చొప్పున 5 రోజులకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. భోజనాలు ఏర్పాట్లు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కన్వెన్షన్ సెంటర్ అద్దె రోజుకు సుమారు రూ.6 లక్షల చొప్పున వారం రోజులకు రూ.50 లక్షలు ఖర్చువుతోంది. ఇతర ఖర్చులు మరో రూ.2కోట్ల వరకూ అవుతుందని అంచనా. ఇదంతా స్థానికఅధికారులు తలతాకట్టు పెట్టి ఖర్చు చేస్తున్నారు. నవనిర్మాణ దీక్షకు సంబంధించి ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల్లో కృష్ణాజిల్లాలోని ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు నిమగ్నమయ్యారు. 15 రోజులుగా ఇదే పని కావడంతో రోజువారీ కార్యక్రమాలు ఎక్కడికక్కడే స్తంభించాయి. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి వరకూ ఇదే పనిలో ఉన్నారు. దీక్షకు హాజరుకావాలి మచిలీపట్నం (చిలకలపూడి ): విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్షకు ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు తప్పక హాజరుకావాలని కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. గతంలో రుణాలు పొందిన లబ్ధిదారులు, ఈ ఏడాది మంజూరైన లబ్ధిదారులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన ఆదేశించారు. -
చార్మి పాటకు రూ.3 కోట్లు
నటి చార్మి సింగిల్ సాంగ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపడంతో ఆమెకిప్పుడు అన్నీ అలాంటి అవకాశాలే తలుపు తడుతున్నాయి. ఆ మధ్య తెలుగులో ఎస్కో నా గుమ గుమా ఛాయ్ అంటూ కుర్రకారుకు కిరాక్ పుట్టించిన ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్ ఛాన్స్‌లు రావడం మొదలెట్టాయి. కథానాయకిగా అవకాశాలు కనుమరుగవ్వడంతో సింగిల్ సాంగ్ అవకాశాలు బాగున్నాయనుకుని వాటి సంగతి చూసేస్తే పోలా అన్న నిర్ణయానికి వచ్చిన చార్మి ఇటీవల విక్రమ్ హీరోగా నటిస్తున్న పత్తు ఎండ్రత్తుకుళే చిత్రంలో ఐటమ్ సాంగ్ చేశారు. గోలీసోడావంటి చిన్న చిత్రంతో పెద్ద విజయం సాధించిన దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో చార్మి సింగిల్ సాంగ్‌కు మాత్రమే ఖర్చు చేసిన డబ్బు మూడు కోట్లు అని కోలీవుడ్ వర్గాల సమాచారం. కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే గోలీసోడా తీసి సక్సెస్ సాధించిన విజయ్ మిల్టన్ తదుపరి చిత్రంలో ఒక్క సాంగ్‌కే మూడు కోట్లు ఖర్చు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఐ వంటి బ్రహ్మాండమైన చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఆ మాత్రం భారీతనం అవసరమేనంటున్నారు పత్తు ఎండ్రత్తుకుళే చిత్ర వర్గాలు. ఏదేమైనా ఇలాంటి విషయాలతో నటి చార్మి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు. ఈ చర్చ ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందో, లేదో? చూద్దాం. ఈ చిత్రంలో కథానాయకిగా చెన్నై చిన్నది సమంత నటిస్తున్నారు. -
ఈ తిక్కకి లెక్కుంది...!
ఈవిడగారికి కొంచెం తిక్క ఉన్నట్టుందని ప్రస్తుతం బాలీవుడ్లో కరీనాకపూర్ గురించి అనుకుంటున్నారు. దానికి కారణం తాజాగా ఆమె కుదుర్చుకున్న ఓ డీల్. ఓ గ్రీన్ టీ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించడానికే ఆమె ఈ డీల్ కుదుర్చుకున్నారు. మామూలుగా ఇలాంటి వాటికి నాలుగు నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేసే కరీనా ఈ ప్రచారానికి మాత్రం మూడు కోట్లే అడిగారు. కరీనాలాంటి క్రేజ్ ఉన్న తారలు పారితోషికం ఇంకా ఇంకా పెంచుతారు కానీ, ఇలా తగ్గిస్తారా ఏంటి? అని చెప్పుకుంటున్నారు. అందుకే కరీనాకి తిక్కుందని అనుకుంటున్నారు. కానీ, ఈ సుందరాంగి తిక్కకి ఓ లెక్కుంది. ‘గబ్బర్‌సింగ్’ టైప్ అన్నమాట. గ్రీన్ టీ ఆర్యోగానికి మంచిది కాబట్టి, ఇలాంటి ఉత్పత్తులను ప్రచారం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని కరీనా భావించారట. అందుకే, తక్కువ పారితోషికం అడిగారు. ఇది తెలియక కొంతమంది ఆమెకు తిక్క ఉందని అంటే, మరికొంతమంది మాత్రం, తను ఎక్కువ డిమాండ్ చేస్తే ఈ అవకాశం వేరే నాయికకు వెళ్లిపోతుందని భావించే కరీనా ఓ మెట్టు దిగిందని చెప్పుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు కథలు అల్లుతుంటే, కరీనా మాత్రం గ్రీన్ టీ యాడ్‌కి సంబంధించిన షూట్లో పాల్గొనడానికి డైరీ చెక్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రీకరణ జరగనుంది.