విశాఖ–విల్లుపురం మధ్య సువిధ రైళ్లు
విశాఖ–విల్లుపురం మధ్య సువిధ రైళ్లు
Published Fri, Aug 26 2016 12:03 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దష్టిలో ఉంచుకుని తూర్పు కోస్తా రైల్వే విశాఖపట్నం–విల్లుపురంల మధ్య సువిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. అక్టోబర్ 3 నుంచి నవంబరు 15 వరకు వారానికి మూడుసార్లు చొప్పున తిరగనున్నాయి. రైలు నంబర్ 82853తో అక్టోబర్ 3 నుంచి నవంబర్ 11 వరకు విశాఖ–విల్లుపురంల మధ్య సోమ, బుధ, శనివారాల్లో నడుస్తాయి. ఈ రైలు విశాఖలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3.30 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 82854 నంబరుతో విల్లుపురం–విశాఖపట్నంల మధ్య మంగళ, గురు, ఆదివారాల్లో అక్టోబరు 4 నుంచి ఈ సువిధ రైళ్లు బయలుదేరతాయి. అక్టోబరు 4 నుంచి 15 వరకు రాత్రి 8.30కి బయలుదేరి మర్నాడు సాయంత్రం 3.15కి విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు స్టేషన్లలో ఆగుతాయి. ఈ సువిధ రైలుకు సెకండ్ ఏసీ–1, థర్డ్ ఏసీ–3, స్లీపర్–7, సాధారణ భోగీలు–4, లగేజీ–2 వెరసి 16 బోగీలు ఉంటాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ కోరారు.
Advertisement
Advertisement