దసరాకు ప్రత్యేక రైళ్లు | special trains for dasara | Sakshi
Sakshi News home page

దసరాకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Jul 28 2016 6:00 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరాకు ప్రత్యేక రైళ్లు - Sakshi

దసరాకు ప్రత్యేక రైళ్లు

తాటిచెట్లపాలెం : దసరా సమయంలో ప్రయాణికుల రద్దీ దష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు ఈస్టుకోస్టు రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. 
 
విశాఖపట్నం–తిరుపతి–విశాఖ వీక్లీ సువిధ స్పెషల్‌(82851/52)
 ఈ రైలు విశాఖపట్నంలో (82851) అక్టోబర్‌ 3 నుంచి నవంబర్‌ 14 వరకు గల అన్ని సోమవారాల్లో రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (82852) తిరుపతిలో అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 15 వరకు గల అన్ని మంగళవారాల్లో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఓ సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, 9 స్లీపర్‌ క్లాస్, ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ల సామర్థ్యమున్న ఈ జత రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు,విజయవాడ, న్యూగుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
 
విశాఖ–సికింద్రాబాద్‌–విశాఖ వీక్లీ స్పెషల్‌(08501/02)
ఈ రైలు విశాఖలో (08501) అక్టోబర్‌ 4 నుంచి నవంబర్‌ 15 వరకు అన్ని మంగళవారాల్లో రాత్రి 11 గంటల కు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08502) అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 16 వరకు గల అన్ని బుధ వారాల్లో సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 04.30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 04.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఓ సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, 10 స్లీపర్‌ క్లాస్, 6 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ల సామర్థ్యమున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement