సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించనున్న సందర్భంగా ‘విశాఖ వర్ధిల్లాలంటూ’ ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజలు, ప్రార్ధనల కార్యక్రమాల్లో వికేంద్రీకరణ జేఏసీ నేతలు, వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
‘విశాఖను రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రాలో వలసలు తగ్గుతాయి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. సీఎం జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. సీఎం జగన్‌కు స్వాగతం పలకడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. విశాఖకు రాజధానిగా కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. రాజధాని ఎంపికలో చంద్రబాబు నాయుడు.. నారాయణ సలహాలు తీసుకుంటే.. సీఎం జగన్ మాత్రం మేధావుల సలహాలు తీసుకున్నారు’ అని వికేంద్రీకరణ జేఏసీ స్పష్టం చేసింది.
‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి
Comments
Please login to add a commentAdd a comment