దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి | need of the hour is blankets and towels, tweets shruti haasan | Sakshi
Sakshi News home page

దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి

Published Mon, Dec 7 2015 3:03 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి - Sakshi

దుప్పట్లు, టవల్స్ కావాలి.. పంపండి: శ్రుతి

భారీవర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన చెన్నైలో ఎప్పుడు ఏం కావాలో.. ఎవరెవరి నుంచి సాయం అందుతోందో అనే విషయాలను సెలబ్రిటీలు కూడా బాగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా హీరో సిద్దార్థ, హీరోయిన్ శ్రుతిహాసన్ వేర్వేరుగా తమ అభిమానులు, ఇతరుల ద్వారా సేవా కార్యక్రమాలను సమన్వయం చేస్తూ చెన్నై వాసులను ఆదుకోడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైవాసుల్లో చాలా మందికి దుప్పట్లు, టవల్స్ అవసరమని, వాటితోపాటు పారిశుధ్యానికి సంబంధించిన ప్రాథమిక అవసరాలు కూడా ఉన్నాయని.. సాయం చేసేవాళ్లు ముందుకు రావాలని శ్రుతిహాసన్ ట్విట్టర్ ద్వారా అభిమానులను కోరింది.

పంజాబీ- కెనడియన్ అమ్మాయి సుఖ్‌మన్ ఫంగురా, కమల్.. శ్రుతిలకు వీరాభిమాని అయిన శ్రీరామ్ తదితరులు సహాయ కార్యక్రమాల్లో చాలా చాలా సాయం చేస్తున్నారని, అందుకు వాళ్లకు బోలెడంత అభినందనలని చెప్పింది. వీళ్ల కృషితో చాలా మేలు జరిగిందని ప్రశంసించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement