చెన్నై: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మాంచి జోరుమీదున్న ముద్దుగుమ్మ హన్సిక.. తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చిక్కుకుందట. ఊహించని ఈ పరిణామానికి తెగ టెన్షన్ పడింది. చివరికి చెన్నై విమానాశ్రయం నుంచి హోటల్ కు చేరడానికి చాలా పెద్ద సాహసమే చేసింది. చెన్నై రోడ్లపై హోరువానలో గంటపాటు నడిచి తెల్లవారుఝామున మూడు గంటలప్రాంతంలో హోటెల్ కు చేరింది.
అటు జోరువాన.. ట్రాఫిక్ జామ్, ఇటు చూస్తే మోకాళ్ల లోతు నీళ్లు. మరోవైపు సిగ్నల్స్ లేక కనెక్ట్ కాని మొబైల్స్. ఇలా దాదాపు గంటల నరకయాతన అనుభవించి.. చివరికి ఎలాగోలా బయటపడ్డానుంటూ ఈ విషయాలను స్వయంగా హన్సికానే మీడియాకు వివరించింది.
'చలికి వణికిపోయా... వానకెదురు నడుస్తోంటే....కాళ్లు నొప్పులు.. అభిమానులు గుర్తు పట్టేశారు.. పేరు పెట్టి పిలవడం మొదలు పెట్టారు. అయినా ఎలాగోలా చేరాను .దాదాపు ముంబై దాడులప్పుడు కూడా ఇలాంటి సిట్యుయేషన్నే ఎదుర్కొన్నాఅపుడు నా స్నేహితులు చాలామంది సాయం చేశారంటూ' ఆనాటి జ్ఞాపకాలను మీడియాతో షేర్ చేసుకుంది.
స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తున్న హన్సిక ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ సందర్భంగానేఈ పాలబుగ్గల సుందరి చిక్కుల్లో పడిందట. విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి వెళ్లలేక మద్యలోనే చిక్కుకు పోయింది. ఎడతెరిపిలేని వానలు నగరాన్ని ముంచెత్తడంతో దాదాపు మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంటపాటు ఇరుక్కుపోయిందట. ఇక ఎటూ పాలుపోని పరిస్థితుల్లో సుదీర్ఘంగా అంటే గంటపాటు నడక సాగించాల్సొచ్చిందంట. తనకు కేటాయించిన హోటెల్ కు చేరుకోవాలంటే కనీసం గంటా రెండు గంటల టైమ్ పడుతుందట.. అభిమానులు చుట్టుముట్టి గందరగోళం సృష్టించినా చివరకి నడుచుకుంటూనే హోటల్ కు చేరిందట.
వరదల్లో చిక్కుకుని అష్టకష్టాలు పడ్డ హీరోయిన్
Published Wed, Nov 25 2015 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM
Advertisement
Advertisement