హన్సికలో మరో కోణం! | hansika Do When She's Not Shooting? | Sakshi
Sakshi News home page

హన్సికలో మరో కోణం!

Published Wed, Jan 20 2016 3:04 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

హన్సికలో మరో కోణం! - Sakshi

హన్సికలో మరో కోణం!

సినిమా షూటింగ్‌లు లేనప్పుడు ఖాళీ సమయంలో నటులు ఏం చేస్తారు? చాలామంది సంగతి ఏమో కానీ టాలీవుడ్‌ ముద్దుగుమ్మ హన్సిక మాత్రం తనలోని కళాత్మక అభిరుచిని మెరుగుపరుచుకుంటోంది. తీరిక సమయం దొరికితే చాలు ఈ 'దేశముదురు' హీరోయిన్ చేతిలో కుంచె పట్టుకుంటుంది. తనలోని భావాలకు కాన్వాస్‌మీద రూపమీస్తూ.. అందమైన కళాఖండాలకు ప్రాణం పోస్తుంది. ఇది కేవలం ఆత్మసంతృప్తి కోసం, తనలోని కళాతృష్ణను తీర్చుకోవడానికే కాదు.. తన పెయిటింగ్స్‌ ద్వారా సమకూరే నిధులను సామాజిక సేవా కార్యక్రమాలను వెచ్చించాలనుకుంటోంది  ఈ అమ్మడు. తన పెయింటింగ్స్ అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును అభాగ్యులైన చిన్నారులు, వృద్ధుల సంక్షేమం కోసం వినియోగించాలన్నది ఆమె తపన.

తన ఈ కళాత్మక కోణాన్ని ఆవిష్కరిస్తూ గతంలో ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని హన్సిక తాజాగా ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. తాను కాన్వాస్‌పై రంగులద్దుతూ లీనమైన ఫొటోలను కొన్నింటినీ పంచుకుంది. తీరిక దొరికితే చాలు తన తోటి హీరోయిన్లు షాపింగ్లు, పార్టీలు అంటూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ విషయంలో మాత్రం తాను అందుకు విరుద్ధమని, పార్టీలు గట్రా తనకు నచ్చవని ఆమె చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement