ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ | Hansika Starts New Channel on Youtube! | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

Jun 14 2016 11:58 PM | Updated on Jul 26 2018 5:23 PM

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ - Sakshi

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

అభిమాన తారలను పలకరించాలంటే, లేదా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఫ్యాన్స్‌కు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా.

అభిమాన తారలను పలకరించాలంటే, లేదా వాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఫ్యాన్స్‌కు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో తమకు నచ్చిన తారలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. హన్సికతో అలా టచ్‌లో ఉండే అభిమానులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు తన ఫాలోయర్స్‌కి ఓ బహుమతి  ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. మనసులోని మాటలను స్వయంగా చెబితే అభిమానులు ఇంకా ఆనందపడతారన్నది హన్సిక ఆలోచన.
 
  అందుకు యూట్యూబ్ చానల్ బెస్ట్ అనుకున్నారామె. దీని గురించి హన్సిక యూట్యూబ్ యాజమాన్యంతో కూడా సంప్రతింపులు జరిపారు. దీని గురించి హన్సిక మాట్లాడుతూ- ‘‘ఇప్పటికే నేను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉన్నాను. నా కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు, వాటి షూటింగ్ వీడియోలు, ఇంకా ఆసక్తికరమైన విశేషాలను కూడా పంచుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్ అయితే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు. సో.. త్వరలో హన్సిక యూట్యూబ్‌లో హల్‌చల్ చేయనున్నారన్న మాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement