104వ అంతస్తులో అందాలతార | Hansika visits CN Tower in Toronto | Sakshi
Sakshi News home page

104వ అంతస్తులో అందాలతార

Published Sat, Oct 24 2015 3:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

104వ అంతస్తులో అందాలతార

104వ అంతస్తులో అందాలతార

ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే పాలబుగ్గల అందాలతార హన్సిక ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి కెనడాలోని టొరంటో పట్టణంలో చక్కర్లు కొడుతున్నారు. తన టూర్ విశేషాలన్నీ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారు. అలానే శనివారం టొరంటోలో ఉన్న సిఎన్ టవర్లోని 104వ అంతస్తులో దిగిన ఓ ఆసక్తికర ఫొటోని ఇన్స్టాగ్రమ్లో షేర్ చేశారు. అంతే.. డేంజరస్ అని, సూపర్బ్ అని, క్యూట్ అని రకరకాల  కామెంట్స్ వస్తున్నాయి ఆ ఫొటోకి.

టొరంటోలోని సిఎన్ టవర్ ప్రపంచంలోని మూడో అతి ఎత్తయిన కట్టడం. 553.33 మీటర్ల ఎత్తుతో 147 అంతస్తులు కలిగిన ఈ ఆకాశ సౌధం కెనడా  పర్యాటక, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన నిర్మాణం అని ప్రఖ్యాతి చెందిన సి.ఎన్ టవర్‌ను 2010 తరువాత బుర్జ్ ఖలీఫా భవనం అధిగమించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement