72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు | ilayaraja braves flood waters to feed visually challenged students | Sakshi
Sakshi News home page

72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు

Published Fri, Dec 4 2015 2:12 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు

72 ఏళ్ల వయసులో.. పడవలో వెళ్లి సాయం చేశారు

జనజీవనాన్ని అతలాకుతలం చేసిన చెన్నై వరదల పై సామన్యులతో పాటు ప్రముఖులు కూడా బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన చాలామంది ఇప్పటికే తమవంతుగా విరాళాలు ప్రకటించగా, మరికొందరు ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే బాటలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సాయం చేయడానికి ఎంత డబ్బయినా ఇచ్చే స్థోమత ఉన్నా,  అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకోవాలని భావించిన ఇళయరాజా, 72 ఏళ్ల వయసులో కూడా పడవలో ప్రయాణిస్తూ లిటిల్ ఫ్లవర్ అంధుల పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు ఆహార పొట్లాలను అందించారు. కాసేపు వారితోనే గడిపిన రాజా వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement