మానవత్వం తలుపులు తెరిచింది! | Chennai rains: Residents open doors, and hearts, for all | Sakshi
Sakshi News home page

మానవత్వం తలుపులు తెరిచింది!

Published Wed, Dec 2 2015 4:10 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

మానవత్వం తలుపులు తెరిచింది! - Sakshi

మానవత్వం తలుపులు తెరిచింది!

చెన్నై: ఎడతెరిపిలేని వర్షాలు.. వరద నీళ్లతో చెరువులను తలపిస్తున్న రోడ్లు. మూతపడిన రైల్వేస్టేషన్లు, విమానాశ్రయం. ఆగిపోయిన రవాణావ్యవస్థ. ఇంటర్నెట్‌, ముబైల్ సేవలు బంద్‌. నిండుకుండను తలపిస్తున్న చెన్నై మహానగరం. ఇంత కష్టకాలంలో, ఈ అనుకోని వర్ష బీభత్సంలోనూ చెన్నైవాసులు గుండెలోపలి మానవత్వాన్ని తట్టిలేపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి తమ ఇంటి తలుపులు తెరిచారు. వర్షబీభత్సంలో చిక్కుకున్నవారికి సురక్షితంగా ఉన్న తమ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు చాలామంది చెన్నైవాసులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో సందేశాలు పెట్టారు.

అదృష్టవశాత్తు తమ తమ నివాసాలు నీటిలో మునిగిపోలేదని, వర్షాల్లో చిక్కుకుపోయిన ఎవరైనా భద్రత, ఆశ్రయం కావాల్సివస్తే తమ ఇంటి తలుపును తట్టవచ్చునని సోషల్‌ మీడియాలో తెలిపారు. తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్లు ఇచ్చారు. వర్షాలు ఆగకపోతే ఈ రాత్రి తమతోపాటు గడుపవచ్చునని మానవత్వాన్ని చూపారు.

నిజానికి గత వందేళ్లలోనే రికార్డుస్థాయిలో నమోదైన వర్షంతో చెన్నై నగరం స్తంభించిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ఇళ్లు నీటమునిగాయి. రోడ్లు చెరువులను తలిపిస్తుండటం, వరద ఉధృతికి సైదాపెట్‌ ఆనకట్ట ఊగిపోతుండటం.. అక్కడి వర్షబీభత్సాన్ని చాటుతోంది. మోకాళ్లలోతు నీళ్ల చేరిన రోడ్లపై వాహనాలను నడుపలేక.. ఇళ్లకు చేరలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చెన్నైవాసుల పెద్ద హృదయం పలువురి ప్రశంసలందుకుంటున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement