వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం | On December 1-2 Chennai Received More Rainfall in Over 100 Years: NASA | Sakshi
Sakshi News home page

వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం

Published Wed, Dec 9 2015 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం

వందేళ్లలో ఇదే అతి భారీ వర్షం

వాషింగ్టన్: తమిళనాడు రాజధాని చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలను.. చెన్నైవాసులు గతంలో ఎప్పుడూ చూసిఉండకపోవచ్చు. గత వందేళ్లలో చెన్నైలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురవలేదు. 1901 తర్వాత ఈ నెల 1-2 తేదీల మధ్య 24 గంటల్లో చెన్నైలో అతిభారీ వర్షం పడినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలియజేసింది. అంటే గత 114 ఏళ్లలో చెన్నైలో ఇదే అతి భారీ వర్షం.

ఈ నెల 1-2 తేదీల మధ్య ఆగ్నేయ భారత్లో కురిసిన వర్షపాతంపై మంగళవారం నాసా యానిమేషన్ మ్యాప్ను విడుదల చేసింది. ఉపగ్రహం సాయంతో చెన్నైలో వర్షపాతాన్ని అంచనా వేసింది. ఇటీవలి భారీ వర్షాలకు చెన్నైలో ఓ ప్రాంతంలో 50 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు నాసా వెల్లడించింది. రుతుపవనాల వల్ల ఈ సీజన్లో డిసెంబర్కు ముందే తమిళనాడులో సాధారణ శాతం  కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావం వల్ల భారత్ తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రతి ఏటా 50 నుంచి 60 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.     


చెన్నైలో ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 250 మంది మరణించిన సంగతి తెలిసిందే. రోడ్లు,  రైల్వే ట్రాక్లు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయం కావడంతో బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు దొరకక చెన్నై వాసులు అలమటించారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గాక సహాయక చర్యలను వేగవంతం చేయడంతో చెన్నై వాసులు కోలుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement