
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు.
చెన్నై నుంచి ఫ్రాంక్‌ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్‌లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు.
ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు
Comments
Please login to add a commentAdd a comment