tamil nadu rains
-
తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు
-
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
పెళ్లి కోసం వధూవరుల సాహసం.. వరద నీటిలోనే..!
చెన్నై: తమిళనాడులో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. దీంతో పలు వివాహాలు సైతం రద్దయ్యాయి. పులియంతోపులలోని ఆంజనేయుడి ఆలయంలో శుక్రవారం జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయి. ఆంజనేయుడి సన్నిధి మొత్తం నీటితో నిండిపోయింది, పరిసరాల్లో సైతం ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో ఆ వరద నీటిలోనే ఐదు జంటలు వివాహం చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితమే ఖరారు చేసిన ముహూర్తం కావడంతో వరదతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ తంతును పూర్తి చేశారు. పై నుంచి చినుకులు రాలుతుండగా.. వరద నీటిలో గొడుగు పట్టుకుని నూతన వధూవరులు ఆలయానికి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వర్షంలోనూ ఎంతో సంతోషంగా ఆలయానికి చేరుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి కొత్త జంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు. చెన్నై సహా చుట్టు పక్కల జిల్లాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. చెన్నై, చెంగల్పెట్, కాంచీపురం, తిరువల్లూర్, విల్లుపురమ్ జిల్లాల్లో పాక్షికంగా మూతపడ్డాయి. #WATCH | Tamil Nadu: 5 weddings that were scheduled at Anjineyar temple in Pulianthope were delayed due to rainfall today. Couples lined up for wedding ceremonies were drenched as they walked through the water logged inside the temple. These weddings were scheduled months ago. pic.twitter.com/OA96wQEiz2 — ANI (@ANI) November 11, 2022 ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
రూ. 10 లక్షలు కాదు రూ. 10 కోట్లు
చెన్నై: వరద బాధితులను ఆదుకునేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రూ. 10 కోట్లు ప్రకటించారు. అంతకుముందు ఆయన రూ. 10 లక్షలు ప్రకటించారు. ఆయనకంటే చిన్న హీరోలు సైతం ఎక్కువ మొత్తంలో సహాయం ప్రకటించడంతో రజనీకాంత్ విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతకుముందు ప్రకటించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి రూ. 10 కోట్ల చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందించారు. కాగా, వరదల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. రోబో 2 సినిమా షూటింగ్ ప్రారంభోత్సవాన్ని కూడా వాయిదా వేశారు. హీరో విజయ్ రూ. 5కోట్లు, సూర్య-కార్తీ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, విశాల్ రూ. 10 లక్షలు, ధనుష్ రూ. 5లక్షలు సహాయం ప్రకటించారు. -
'చెన్నై వాసులకు హేట్సాఫ్'
న్యూఢిల్లీ/చెన్నై: వరద బాధితులను ప్రతిఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వరదల్లో చిక్కుకున్న తోటివారికి చెన్నై వాసులు తమ వంతు సహాయం చేస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న చెన్నై వాసులకు ట్విటర్ ద్వారా హేట్సాఫ్ చెప్పారు. కాగా వరదల్లో చిక్కుకున్న వారికి సాయం అందించేందుకు చెన్నై వాసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఆహారం తయారుచేసి బాధితులకు సరఫరా చేస్తున్నారు. కొంతమంది తాగునీరు అందిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాయం అందిస్తున్నారు. సామాజిక అనుసంధాన వెబ్ సైట్ల ద్వారా సేవల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అభిమానులను, సన్నిహితులకు విజ్ఞప్తి చేస్తున్నారు. Hats off 2 Chennai ppl 4 d way they r trying 2 help their brethren who r affected in floods.This is d time everyone should help d helpless. — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 4, 2015 -
'చెన్నైలో వరద తగ్గుతోంది'
చెన్నై: భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు. -
అడిగింది 5వేల కోట్లు.. ఇచ్చింది వెయ్యి కోట్లు
చెన్నై: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ. 5 వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోరారు. భారీవర్షాల కారణంగా సంభవించిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో గురువారం ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత మోదీని జయలలిత కలిశారు. భారీవర్షాలతో తమ రాష్ట్రానికి జరిగిన నష్ట్రాన్ని వివరించారు. జాతీయ విపత్తు స్పందన నిధి(ఎన్డీఆర్ ఎఫ్) కింద రూ. 5 వేల కోట్లు సహాయం చేయాలని ఆర్థించారు. జయ విన్నపానికి స్పందించిన మోదీ రూ.1000 కోట్లు ఎన్డీఆర్ ఎఫ్ కింద తక్షణమే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సహాయక కార్యక్రమాలకు అదనంగా 10 ఆర్మీ బలగాలు, 20 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను పంపాలని జయలలిత కోరగా ప్రధాని అంగీకరించారు.