'చెన్నైలో వరద తగ్గుతోంది' | Water level has receded in many areas, so I believe situation has improved: OP Singh | Sakshi
Sakshi News home page

'చెన్నైలో వరద తగ్గుతోంది'

Published Fri, Dec 4 2015 9:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

'చెన్నైలో వరద తగ్గుతోంది'

చెన్నై: భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్‌ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగవుతోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement