OP Singh
-
విమానాశ్రయాలు ఇక దుర్భేద్యం
న్యూఢిల్లీ: దేశంలోని పౌర విమానాశ్రాయాలు మరికొన్ని నెలల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లతో శత్రుదుర్భేద్యంగా మారనున్నాయి. ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కోసం స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, తక్షణం స్పందించే జవాన్లు, రక్షక కవచ వాహనాలు, పటిష్ట ఫెన్సింగ్, ట్యాగ్ రహిత బ్యాగేజీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) దీనికి సంబంధించి ప్రణాళికా పత్రాన్ని రూపొందిస్తోంది. విమానాశ్రయాల భద్రత అంశాలన్నీ సమన్వయం, ఏకీకృతం చేసేలా పత్రాన్ని రూపొందిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జరనరల్ ఓపీ సింగ్ చెప్పారు. మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేసేలా సీసీటీవీలను ఆధునీకరించాల్సి ఉంటుందని భద్రతా సంస్థలు రూపొందించిన బ్లూప్రింట్‌లో పేర్కొన్నారు. -
'చెన్నైలో వరద తగ్గుతోంది'
చెన్నై: భారీవర్షాలతో కుదేలైన తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి మెరుగవుతోందని జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ ఎఫ్) డీజీ ఓపీ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో కరెంట్ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కమ్యూనికేషన్ నెట్ వర్క్ మెరుగవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. హోంశాఖ కార్యదర్శి, రిలీఫ్ కమిషనర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు తాము 9 వేల మందిని కాపాడామని తెలిపారు. పంజాబ్ నుంచి 5 ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఈ తెల్లవారుజామున చెన్నై చేరుకున్నాయన్నారు. పుణే, పాట్నా, గువాహటి నుంచి ఐదేసి బృందాలు రానున్నాయని తెలిపారు.