విమానాశ్రయాలు ఇక దుర్భేద్యం | will do Airports are fortified | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాలు ఇక దుర్భేద్యం

Published Mon, Mar 6 2017 2:58 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

will  do Airports are fortified

న్యూఢిల్లీ: దేశంలోని పౌర విమానాశ్రాయాలు మరికొన్ని నెలల్లో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లతో శత్రుదుర్భేద్యంగా మారనున్నాయి. ఉగ్రవాద దాడుల నుంచి రక్షణ కోసం స్మార్ట్‌ సీసీటీవీ కెమెరాలు, తక్షణం స్పందించే జవాన్లు, రక్షక కవచ వాహనాలు, పటిష్ట ఫెన్సింగ్, ట్యాగ్‌ రహిత బ్యాగేజీ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) దీనికి సంబంధించి ప్రణాళికా పత్రాన్ని రూపొందిస్తోంది. విమానాశ్రయాల భద్రత అంశాలన్నీ సమన్వయం, ఏకీకృతం చేసేలా పత్రాన్ని రూపొందిస్తున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జరనరల్‌ ఓపీ సింగ్‌ చెప్పారు. మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేసేలా సీసీటీవీలను ఆధునీకరించాల్సి ఉంటుందని భద్రతా సంస్థలు రూపొందించిన బ్లూప్రింట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement